తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రాంబార్కి శరత్ గురువారం వెయ్యి కుటుంబాలవారితో కలసి వైఎస్సార్సీపీలో చేరారు. బొబ్బిలి కోటలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన సమక్షంలో శరత్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో శరత్ తన అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. చేరిక సందర్భంగా బొబ్బిలి పట్టణమంతా వైఎస్సార్సీపీ జెండాలతో కళకళలాడింది.
-న్యూస్‌లైన్, బొబ్బిలి (విజయనగరం)
No comments:
Post a Comment