వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోన్‌రెడ్డితో సయోధ్యకు కాంగ్రెస్ ఏవైనా ప్రయత్నాలు చేస్తోందా? అన్న ప్రశ్నలకు అలాంటిదేం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్‌తివారీ స్పష్టంచేశారు. ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన తివారీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు ముక్తసరిగా జవాబిచ్చారు. ఏపీతో సహా ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికల విజయావకాశాలపై కాంగ్రెస్ పార్టీ సవివరమైన సమీక్ష నిర్వహిస్తోందని, జగన్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తోందని, ఇందుకోసం జగన్ తల్లి వై.ఎస్.విజయలక్ష్మి, కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ మధ్య ఓ సమావేశం జరిగిందని వార్తలొచ్చాయి. ఇవి ఏమేరకు నిజమని ప్రశ్నిం చగా తివారీ స్పందిస్తూ.. ‘‘మీరు ఏ కథనాన్ని అయితే ప్రస్తావిస్తున్నారో అందులోనే దీనికి జవాబు ఉంది.
కథనం రాసేముందు ధ్రువీకరణ కోసం పంపిన కొన్ని ఎస్‌ఎంఎస్‌లకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్‌తివారీ స్పందించలేదని కూడా ఆ కథనంలో రాశారు. అందువల్ల.. ఇప్పుడు మీ ప్రశ్నకు అదే నా సమాధానం’’ అని ముగించారు. ఇదిలావుంటే.. ఓ ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా వచ్చిన సదరు కథనంలో ఎలాంటి పసా లేదని ఏఐసీసీ వర్గాలు స్పష్టంచేశాయి. ఏవో కొన్ని సర్వేలు పార్టీ పరంగా నిర్వహిస్తుండటం సహజమే కానీ ఎన్నికల విజయావకాశాలపై పార్టీ పరంగా ఇంతముందుగా సమీక్ష జరపటం ఉండదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ధ్రువీకరించని సమాచారం ఆధారంగా కథనం ఇచ్చినట్టు సదరు ఆంగ్లపత్రిక స్పష్టంగా పేర్కొన్నందున దానిపై ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదన్నాయి.

No comments:
Post a Comment