పులివెందుల(వైఎస్సార్ జిల్లా) న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 5 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు 380 వాహనాల్లో బుధవారం ఉదయం పూతలపట్టులో బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు తరలి వచ్చారు.
చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, పార్టీ పరిశీలకులు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, జడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నేత సజ్జల దివాకర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిల సమక్షంలో పూతలపట్టు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖరరెడ్డి(బాబురెడ్డి), సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ముందుగా ఇడుపులపాయలో పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ బాబురెడ్డి, సుబ్బారెడ్డిలకు వైఎస్‌ఆర్ సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ వైఎస్ ఘాట్ వద్దకు చేరుకొని సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని ఇంటి వద్ద అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కాణిపాకం దేవస్థాన మాజీ చైర్మన్ జగన్నాథరెడ్డి, దేవాదాయ శాఖ మాజీ సహాయ కమిషనర్ కేశవులు, పూతలపట్టు మాజీ జడ్పీటీసీ భారతి, మాజీ ఎంపీపీ అంబుజమ్మ, 10 మంది ఎంపీటీసీలు, 24 మంది సర్పంచ్‌లు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

No comments:
Post a Comment