YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 1 August 2012

రాష్ట్రవ్యాప్తంగా హైఆలర్ట్!

పూణె పేలుళ్ళ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ను ప్రకటించారు. పలు చోట్ల తనిఖీలు ప్రారంభించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. 


పుణె: పుణె పట్టణంలో ఐదు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పుణెలోని బాల గంధర్వ థియేటర్, డెక్కన్ రోడ్, గార్వేర్ కాలేజ్, జేఎం రోడ్డులో పేలుళ్లు జరిగినట్టు సమాచారం. ఈ పేలుళ్లలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. తక్కువ తీవ్రత కలిగిన పేలుళ్లలో ఓ సైకిల్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర కు చెందిన నేత కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఈ పేలుళ్లు జరగడం చర్చనీయాంశమైంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!