తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్నాలని విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నెల్లూరు : తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజగోపాల్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త విన్నవెంటనే ఆయన హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమద ఘటన దురదృష్టకరమని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. బోగీలు తలుపులు లాక్ చేసి ఉండటం వల్ల చాలామంది ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
మరోవైపు రైలు ప్రమాద బాధితులకు ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయక చర్యలు చేపట్టింది. ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేసేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కాగా నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక బొల్లినేని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చిస్తున్నట్లు తెలిపారు. బోగీలో ఇంకా మృతదేహాలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తున్నామన్నారు. లోపల పొగ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రమాద విషయం తెలియగానే వెంటనే చర్యలు చేపట్టామని నెల్లూరు ఎస్పీ తెలిపారు.
న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 50మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారం రాత్రి న్యూఢిల్లీ బయల్దేరిన ఈరైలు ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్ -10, ఎస్ -11 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రమాదానికి గురైన S-11 బోగి శవాల గుట్టను తలపిస్తోంది. ప్రయాణికులు మంటలకు మాడి మసైపోయాయి. కనీసం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. పొగకు ఊపిరాడకా చాలా మంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రయాణికులంతా తమిళనాడుకు చెందిన వారిగానే భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన బోగి... ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. బెర్తులన్నీ బూడిద కుప్పలుగా మారాయి. శవాల్ని అతికష్టమ్మీద బయటకు తీస్తున్నారు.
శనివారం రాత్రి పదిన్నరకు ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ రైలు ఈ ఉదయం ఏడుగంటలకు చెన్నై చేరాల్సి ఉంది. విజయవాడ నుంచి బయల్దేరిన ఈ రైలుకు తర్వాతి స్టాప్ చెన్నైయే. నెల్లూరు విజయమహల్ గేట్ దగ్గర మండుతున్న బోగిని గేట్‌మ్యాన్ గుర్తించినట్టు తెలుస్తోంది. అతనే డ్రైవర్‌ను అలర్ట్ చేసినట్టు సమాచారం.
కాలిపోయిన బోగిని మిగిలిన రైలు నుంచి వేరు చేశారు. ఎస్ 10 బోగికి కూడా మంటలు అంటుకున్నా అందులోని ప్రయాణికులంతా సురక్షితమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలును నెల్లూరు స్టేషన్‌కు తరలించారు. మిగిలిన రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు మరణించిన వారి బంధువుల్ని తీసుకొని ప్రత్యేక రైలు చెన్నై నుంచి బయల్దేరింది.
నెల్లూరు : తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజగోపాల్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త విన్నవెంటనే ఆయన హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమద ఘటన దురదృష్టకరమని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. బోగీలు తలుపులు లాక్ చేసి ఉండటం వల్ల చాలామంది ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
మరోవైపు రైలు ప్రమాద బాధితులకు ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయక చర్యలు చేపట్టింది. ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేసేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 50మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారం రాత్రి న్యూఢిల్లీ బయల్దేరిన ఈరైలు ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్ -10, ఎస్ -11 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రమాదానికి గురైన S-11 బోగి శవాల గుట్టను తలపిస్తోంది. ప్రయాణికులు మంటలకు మాడి మసైపోయాయి. కనీసం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. పొగకు ఊపిరాడకా చాలా మంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రయాణికులంతా తమిళనాడుకు చెందిన వారిగానే భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన బోగి... ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. బెర్తులన్నీ బూడిద కుప్పలుగా మారాయి. శవాల్ని అతికష్టమ్మీద బయటకు తీస్తున్నారు.
శనివారం రాత్రి పదిన్నరకు ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ రైలు ఈ ఉదయం ఏడుగంటలకు చెన్నై చేరాల్సి ఉంది. విజయవాడ నుంచి బయల్దేరిన ఈ రైలుకు తర్వాతి స్టాప్ చెన్నైయే. నెల్లూరు విజయమహల్ గేట్ దగ్గర మండుతున్న బోగిని గేట్‌మ్యాన్ గుర్తించినట్టు తెలుస్తోంది. అతనే డ్రైవర్‌ను అలర్ట్ చేసినట్టు సమాచారం.
కాలిపోయిన బోగిని మిగిలిన రైలు నుంచి వేరు చేశారు. ఎస్ 10 బోగికి కూడా మంటలు అంటుకున్నా అందులోని ప్రయాణికులంతా సురక్షితమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలును నెల్లూరు స్టేషన్‌కు తరలించారు. మిగిలిన రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు మరణించిన వారి బంధువుల్ని తీసుకొని ప్రత్యేక రైలు చెన్నై నుంచి బయల్దేరింది.
No comments:
Post a Comment