గ్యాస్ సరఫరా విషయంలో రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రధానికి విజయమ్మ రాసిన లేఖను శనివారం వారు విడుదల చేశారు. ‘మనకు 16 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ రావాల్సి ఉంటే 3.4 ఎంఎంఎస్‌సీఎండీయే రావడం దారుణం.
మన వాటాలో కోత పెట్టి రత్నగిరికివ్వడంతో రాష్ట్రం 400 మెగావాట్ల విద్యుదుత్పాదనను కోల్పోతోంది. ప్రస్తుతం ఇంకా ఉత్పాదన తగ్గితే పరిస్థితి దారుణంగా మారుతుంది’’ అంటూ మండిపడ్డారు. మన గ్యాస్‌ను మళ్లిస్తున్నారని సాక్షి పత్రిక ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మేకపాటి విమర్శించారు. వైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బలహీనంగా ఉండటం వల్లే రాష్ట్రం తన వాటా గ్యాస్‌ను సాధించుకోలేకపోతోందని సోమయాజులు ఆవేదన వెలిబుచ్చారు.

No comments:
Post a Comment