నెల్లూరు: తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను కేంద్రం ప్రభుత్వం ప్రకటించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున విజయమ్మ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు ఎక్కువతున్నాయని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్ విజయమ్మ ఆరోపించారు.
కేంద్రం ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని.. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఒకే బోగిలో 28 మంది మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని వైఎస్ విజయమ్మ అన్నారు. రైలు ప్రమాదంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.

No comments:
Post a Comment