హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు చేస్తున్న కుట్రలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 12, 13 తేదీల్లో ఏలూరులో రెండ్రోజులపాటు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పేదలకు పెద్ద చదువులు అందాలన్న ఉన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని నీరుగార్చడంపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సంతృప్త స్థాయిలో వ ర్తింపజేయాలని, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.

No comments:
Post a Comment