న్యూఢిల్లీ: ఏకీకృత ఫీజుల వ్యవహారంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వృత్తివిద్యా కోర్సులలో- ఏకీకృత ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా అంటూ రెండూ వేర్వేరుగా ఉండవనీ, రెండింటికీ ఒకే ఫీజు వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది నుంచే ఏకీకృత ఫీజుల విధానాన్ని అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. అంటే ప్రస్తుతమున్న ఫీజు 31వేల రూపాయల నుంచి సుమారు 60వేల రూపాయలు అవుతుంది. తీర్పు పర్యవసానంతో- ఇంజినీరింగ్, ఎడ్‌సెట్, లాసెట్ వంటి వృత్తివిద్యా కోర్సుల కౌన్సెలింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా- ప్రభుత్వం ఈ ఫీజులను ఖరారుచేస్తే... 750 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. రాష్ట్ర హైకోర్టు- ఫిబ్రవరిలోనే- ఏకీకృత ఫీజులపై తీర్పును ఇచ్చినప్పటికీ... ఈనెల 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించకపోవడంతోపాటు, సకాలంలో ఫీజులపై నిర్ణయం తీసుకోకపోవడం వల్ల.. ఎంసెట్ కౌన్సెలింగ్ మరింత గందరగోళంలో పడింది. గతనెల 29న ఎంసెట్ ఫలితాలు వచ్చినా.. మొదటి దశ మెడకిల్ కౌన్సిలింగ్ పూర్తయిప్పటికీ, ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ తేదీల్ని ప్రటకించలేదు. ఈ కారణంగా రెండు లక్షల 20వేల మంది విద్యార్థులకు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.

No comments:
Post a Comment