విద్యార్థుల జీవితాన్ని రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో పడేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రివ్యూ పిటిషన్ పేరుతో కౌన్సిలింగ్ నిర్వహణకు మరోసారి ప్రభుత్వం జాప్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ పేరును పలికే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ ఫొటో పేరుతో కాంగ్రెస్ ఓ కొత్త డ్రామా మొదలుపెట్టిందని, వైఎస్‌ను మరోసారి విమర్శిస్తే రాష్ట్రంలో ఏ ఒక్కరూ చూస్తూ ఊరుకోరని గట్టు రామచంద్రరావు హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment