పులివెందుల: వైఎస్‌ఆర్‌జిల్లా పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ప్రారంభించారు. స్కానింగ్ పరికరాల పనితీరును డాక్టర్లను అడిగి తెల్సుకున్న ఆమె, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం పులివెందులలో వెనకబడిన తరగతుల సంక్షేమ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. ఏపి వైఎస్‌ఆర్ టీచర్స్ ఫేడరేషన్ యూనియన్ నాయకులు వైఎస్ విజయమ్మను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్ విజయమ్మ వారికి హామీ ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment