ఆ 26జీవోలతో వైఎస్ జనగ్‌కు సంబంధం లేదని వైఎస్సార్సీ పార్టీ కేంద్ర గవర్నింగ్ కమిటీ సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. సదరు జీవోల జారీకి కారణమైన మంత్రులు, ఐఏఏస్ అధికారులకు ప్రభుత్వం న్యాయపరమైన సహాయం అందించేందుకు ముందుకు రావడం సరైంది కాదని వైఏస్సాఆర్ పార్టీ నేతలు భూమా దంపతులు అన్నారు. శుక్రవారం శ్రీశైలం వచ్చిన భూమా దంపతులు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానంతరం దేవస్థానం అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడారు. ఆ జీవోలతో సంబంధం లేని జగన్‌ను ఉద్దేశపూర్వకంగానే జైల్‌లో పెట్టి విచారణ పేరుతో బెయిల్ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చిన్నచిన్న విషయాలకే జగన్‌పై బురదచల్లేందుకు సిద్దమయ్యే ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర మంత్రుల పనితీరు, ప్రభుత్వ పాలనను ఎందుకు ఎండగట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాయకత్వ లోపం కారణంగా పాలన గాడి తప్పుతోందన్నారు. గతంలో ప్రజాపథం, రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలకు ప్రయోజనం చేకూరలేదన్నారు. తాను సీఏంనని చెప్పుకోవడం కోసమే కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట పట్టారని విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment