వైఎస్.విజయమ్మ చేపట్టిన చేనేత ధర్నా వేదికపై గాయపడిన శ్యామల లక్ష్మిని మంగళవారం సిరిసిల్లలో వైఎస్సార్‌సీపీ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, మక్కాన్‌సింగ్, గాజుల బాలయ్య, అక్కరాజు శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘అప్పటిదాకా అందరూ మంచిగనే కుసున్నరు. పాటలు విన్నరు. జై జగనన్నరు.. జై తెలంగాణ అన్నరు. విజయమ్మ రాగానే లేచి నిలబడి మాదిక్కు రాళ్లు, కోడిగుడ్లు విసిరిర్రు. సిరిసిల్ల నేత కార్మిక కుటుంబాల పరిస్థితిని విజయమ్మకు ముందు చెప్పాలని వెళ్లిన. వేదిక మీద కుసున్న. ఒక్కసారిగా రాయచ్చి తాకింది. తల పగిలినంతపనైంది. ఇంకో కోడిగుడ్డచ్చి తాకింది. నా పక్కన కుసున్నోళ్లకు రాళ్లు తాకాయి.
విజయమ్మకు ఎక్కడ తాకుతాయేమోనని భయపడ్డా. మనోళ్లకు తాకిన ఫర్వాలేదుగానీ సిరిసిల్ల నేతన్నల కష్టాలను చూడడానికి వచ్చిన ఆయమ్మకు తాకుతాయేమోనని చాన బాధేసిందంటూ’ వివరించారు. సిరిసిల్ల చేనేత ధర్నా వేదికపై సోమవారం కూర్చున్న లక్ష్మికి కోడిగుడ్డు, రాయి తాకడంతో గాయమైంది. వేదికపై మాట్లాడాలని అనుకున్న గానీ, గిట్ల లొల్లి జెస్తరని అనుకోలేదంటూ లక్ష్మి వెల్లడించారు.
ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మనచేతుల్లో లేకపోయినా కొందరు నాయకులు స్వార్థంతో జనాన్ని రెచ్చగొట్టి కిరాయి మనుషులతో లొల్లి చేయించారన్నారు.

No comments:
Post a Comment