సినీనటుడు మోహన్ బాబు మంగళవారం చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. బరువైన గుండెతో వెళుతున్నానని..... రాష్ట్రంలో మహా భారత యుద్ధం జరుగుతోందన్నారు. మహాభారతంలోని శకునిని చూశామని....ఇప్పుడు ఢిల్లీలో కొంతమంది శకునులను చూస్తున్నామని మోహన్ బాబు అన్నారు.
త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. మ్యాట్రిక్ ప్రసాద్ ను కూడా కలిసినట్లు మోహన్ బాబు తెలిపారు. జగన్, మ్యాట్రిక్ ప్రసాద్ త్వలోనే బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానిజాలు భగవంతునికే తెలుసునని, అంతా మంచే జరుగుతుందని అన్నారు.

No comments:
Post a Comment