టీఆర్‌ఎస్ బంద్ పిలుపు వివాదాస్పదమైంది. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ చేపట్టిన చేనేత ధర్నా నేపథ్యంలో జరిగిన గొడవలకు నిరసనగా టీఆర్‌ఎస్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే సోమవారం సిరిసిల్లలో బంద్ జరిగిన విషయం తెల్సిందే. మంగళవారం కూడా బంద్ పాటించాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలు హోటళ్లలోకి ప్రవేశించి ఇడ్లీపిండి, సాంబారు, సామగ్రిని నేలపాలు చేశారు. దీంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. పాతబస్టాండ్‌లోని నేతన్న విగ్రహం వద్ద రాస్తారోకోకు దిగారు. ‘సోమవారం బంద్ అంటే దుకాణాలు మూసినం.
ఆదివారం బందేనాయె. మంగళవారం బంద్ చేయమంటే ఎలా..? తెలంగాణవాదమంటూ మూడ్రోజుల నుంచి దుకాణాలు బంద్ పెడితే మాలాంటోళ్లు ఎలా బతకాలె..’ అని ఫొటోస్టూడియో నిర్వాహకుడు వంకాయల కార్తీక్ ప్రశ్నించాడు. ‘వేలకు వేలు కిరాయి కడతన్నం. మాటిమాటికీ బంద్‌లు పెడితే బతికేదెలా.. రాత్రికిరాత్రే బందంటే నానబెట్టిన ఇడ్లీపిండి, పప్పు, పాలు ఏంకావాలె...? అని వ్యాపారులు వాపోయారు. ఒకదశలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై తిరగబడ్డారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు సముదాయించారు.

No comments:
Post a Comment