ఢిల్లీలో శకునులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వాన్‌పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌లను ప్రముఖ హీరో మోహన్‌బాబు మంగళవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. మోహన్‌బాబు తనయుడు విష్ణు ఆయన వెంట ఉన్నారు. అనంతరం జైలు బయట మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ తనకు మేనల్లుడని, ప్రసాద్ మిత్రుడు కావటంతో వారిని కలిసినట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి మహాభారత యుద్ధాన్ని తలపిస్తోందని, ఢిల్లీలో కొందరు శకునుల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్, నిమ్మగడ్డలకు మంచి రోజులు వస్తాయని, షిరిడిసాయి ఆశీస్సులతో బయటకు వస్తారని తెలిపారు. ఇద్దరినీ కలిసిన తరువాత బరువెక్కిన హృదయంతో తిరిగి వెళుతున్నానని చెప్పారు.
No comments:
Post a Comment