వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందన్నారు. తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణవాదం పేరుతో డ్రామాలు ఆడుతోందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న ఎంతమంది కుటుంబాలను కెసిఆర్ పరామర్శించారని ఆయన ప్రశ్నించారు. ఎన్ని కుటుంబాలకు సహాయం చేశారని అడిగారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలపడుతుందనే కుట్ర చేశారన్నారు. భవిష్యత్ లో టిఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగనివ్వని సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని హెచ్చరించారు. టిఆర్ఎస్ ఆగడాలను ఖండించాల్సింది పోయి ఒక వర్గం మీడియా మద్దతు పలకడం దారుణం అన్నారు. సిరిసిల్ల ధర్నాపై ఈనాడు ఘోరంగా అబద్ధాలు రాసిందని తెలిపారు. మీడియా ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment