ఉదయగిరి(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు), న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తుగ్లక్ పాలనను తలపిస్తోందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీ ఆయన సోదరుడు, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డితో కలసి వింజ మూరు మండలంలోని పలుగ్రామాల్లో పర్యటిం చారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని, వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. చింతలపాళెంలో రాజమోహన్‌రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ, తుగ్లక్ పాలనలో విధించినట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా రకరకాల పన్నులతో ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు విస్మరించి కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని విమర్శిం చారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే తమ సమస్యలు తీరుతాయన్న గ్రామమహిళల అభిప్రాయంతో ఎంపీ ఏకీభవిస్తూ.. ఆ రోజులు ఎంతో దూ రంలో లేవన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా తాము ఎంపీ నిధులు, సొంత నిధులతో ఫ్లోరైడ్ ప్రాంతాల్లో శుద్ధి జలాలను అందిస్తామన్నారు.
మత్స్యకార సమస్యలపై దృష్టి
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ గురువారం తీరప్రాంత గ్రామాల్లో పర్యటిం చారు. ముత్తుకూరు మండలం పునరావాస కాలనీ మధురానగర్‌లో రాజమోహన్ రెడ్డి మాట్లాడు తూ గంగవరం, ఇతర ఓడరేవుల్లో మత్స్యకారులకు అందించిన తరహాలో ఫిషింగ్‌హార్బర్, ఉద్యోగాలు, ప్యాకేజీలు, విద్య, వైద్య సదుపాయాలను కల్పిం చేందుకు ప్రభుత్వం, పోర్టు యాజమాన్యంతో చర్చిం చనున్నట్లు తెలిపారు. అనంతరం రాజమోహన్‌రెడ్డి నెల్లూరు నగరంలోని కొత్తూరులో ముత్తుకూరు రోడ్డు నిర్వాసితుల ప్రాంతంలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నా
No comments:
Post a Comment