YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 23 July 2012

నేతన్నకు భరోసా

- వైఎస్ ప్రత్యేక ప్యాకేజీ అమలుకు హామీ
- సాగు తాగునీటి ప్రాజెక్టులు మహానేత చలువే..
- నేత కార్మికులందరికీ ధన్యవాదాలు
- వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 

కరీంనగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి : సిరిసిల్ల నేతన్నలకు విజయమ్మ భరోసా కల్పిం చారు. 2008 అక్టోబర్‌లో ఇక్కడి నేత కార్మిక కుటుంబాలకు ఆత్మస్థైర్యం కలిగించేందుకు దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్యాకేజీ అమలు కోసం పోరాడుతూనే... అధికారంలోకి వచ్చాక అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. సోమవారం సిరిసిల్లలో జరిగిన నేతన్న ధర్నాలో విజమ్మ మాట్లాడుతూ.. ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురైన చేనేత కుటుంబాలకు రూ.1.50 లక్షలు అందించడంతో పాటు నేత కార్మికుల సాధారణ మరణాలకు రూ.25 వేలు సీఎం సహాయనిధి నుంచి వైఎస్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడి నేతన్నలను ఆదుకోవటానికి అప్పట్లో వైఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేం దుకు సర్కారుపై పోరాడుతూనే... వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అమల్లో పెడుతామని జగన్‌బాబు ధర్మవరం చేనేత దీక్ష సందర్భంగా తనతో చెప్పారని విజయమ్మ వెల్లడించారు. జిల్లాలోని నేత కార్మికులు ముఖ్యంగా సిరిసిల్ల ప్రజలు ధర్నాకు వచ్చిన తనను ఆదరించి... ఓపిగ్గా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

సర్కారుపై ధ్వజం...

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే ముడి సరుకుల ధరలు పెరిగాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు కరెంటు చార్జీలు, పెట్రోల్ ధరలు, బస్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో నేతన్నలతో పాటు సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో 15 ఎకరాల్లో కామన్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని వైఎస్ హామీ ఇచ్చి భూమిని కేటాయించగా ఇక్కడి కాంగ్రెస్ పెద్దలు వాళ్ల అనుచరుల కోసం దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ గతం లో ఇచ్చిన హామీ ప్రకారం ఈఎస్‌ఐ ఆస్పత్రితో పాటు ఆధునిక మగ్గాలను ఏర్పాటు చేసేందుకు జగన్‌బాబు న్యాయం చేస్తారని తెలిపారు. ఎన్టీఆర్ నేత కార్మికుల కోసం అందించిన చేయూతను కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. 

జలయజ్ఞంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విజయమ్మ ఆరోపించారు. జిల్లాలో మధ్యమానేరు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులన్నీ జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ చేపట్టినవేనని తెలిపారు. ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నా ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదని ఆరోపించారు. చేనేత కార్మికులను ఆదుకున్న ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పాదయాత్రలు గుర్తించిన వైఎస్సార్ అధికారంలోకి రాగానే ప్రత్యేక శ్రద్ద కనబర్చి అమలు పర్చారన్నారు. అదే విధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ కూడా పరిష్కారం కోసం చొరవ చూపడం ఖాయ మన్నారు. 

చేనేత కార్మికుల కోసం రూ. 312 కోట్ల రుణ మాఫీ ప్రణాళికను ప్రకటించింది వైఎస్సేనని పార్టీ అధికారి ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు గుర్తు చేశారు. వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన పాలకులు మాత్రం దాన్ని అమలు పర్చడం లేదని దుయ్యబట్టారు. నేత కార్మికులకు అంత్యోదయ కార్డులు ఇచ్చి ఉచితంగా బియ్యం అందించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. చేనేత రంగం అభివృద్ది కోసం 100 కోట్ల రుణాలు వైఎస్ అందించారని కేంద్ర కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ గుర్తు చేశారు. ఆ మహానేత కుమారుడి పాలనలోనే చేనేతకు న్యాయం జరుగుతుందన్నారు. జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ నేతన్నకు 75 శాతం సబ్సిడీపై విద్యుత్ అందించి వైఎస్ ఆశయాలను నేరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా కల్పించారు.

2014లో ప్రత్యేక ప్యాకేజీ

2014లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే చేనేత ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని ఎమ్మెల్యే కొండా ముర ళి వెల్లడించారు. చేనేత కార్మికులకు అండగా ఉంటా మని హామీ ఇచ్చారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే చేనేత రంగానికి ఈ దుస్థితి అని వైఎస్సార్‌సీపీ నేత నీరంజన్‌రెడ్డి ఆరోపించారు. నైపుణ్యం గల చేనేత కార్మికులు అడ్డా కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పుట్ట మధు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర, జిల్లా నేతలు ప్రసంగించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!