YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 26 July 2012

ఇన్ని విపత్తులకీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణే



రాష్ట్ర పారిశ్రామికరంగం తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. ఇన్ని విపత్తులకీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణే అన్నది నిర్వివాదాంశం. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు, అంతర్గత కుమ్ములాటలకి స్వస్తి చెప్పి, నీరో చక్రవర్తి పాత్ర పోషించడం మాని, సమస్య పరిష్కారం దిశగా ఆశావహక చర్యలు చేపట్టాలి. సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. 2014 నాటికి రాష్ట్రాన్ని ‘ఎనర్జీ హబ్’గా మారుస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రస్తుతం నెలకొని ఉన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రం ఆ నాటికి ‘చీకటి రాష్ట్రం’గా మారకుంటే అదే పదివేలు.

మున్నెన్నడూ కనీవినీ ఎరు గని విద్యుత్ సంక్షోభాన్ని మన రాష్ట్రం ఎదుర్కొంటున్నది. నిపు ణుల అభిప్రాయం ప్రకారం 12 గంటల విద్యుత్ కోతను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చవిచూడ లేదు. భారీ పరిశ్రమలు, చిన్న / లఘు పరిశ్రమలు, వ్యవసా యం... ఇలా అన్ని రంగాలు ఈ సంక్షోభం బారినపడి విలవిల లాడుతున్నాయి. పవర్ హాలిడే, అనియమిత విద్యుత్ కోతలు, చిన్నాచితకా పరిశ్రమల మూసివేత, ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుం దో తెలియని అయోమయం... ఇదీ నేటి రాష్ట్ర దుస్థితి.

భీతి గొలుపుతున్న సంక్షోభం
ఈ నేపథ్యంలో ‘‘వచ్చే ఐదేళ్లలో రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులతో 660 భారీ పరిశ్రమలు, మరో 60,400 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటై, మొత్తం 10.62 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రణాళికా సంఘానికి సమర్పించిన నివేది కలో పేర్కొన్నది. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రగతి లక్ష్యా లలో ఒకటిగా ప్రకటించింది. ప్రభుత్వ భావదారిద్య్రానికి, నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం.

‘కరెంట్ కోతలు’, పారిశ్రామిక రంగానికి మరణ శాసనంగా మారడంతో గత నెలరోజుల్లోనే 20 వేలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, రాష్ట్ర పారిశ్రామికరంగం పునాదులు కదిలి, 80 శాతం పరిశ్రమలు మూతపడటం ఖాయం. ప్రభుత్వ ‘ధృతరాష్ట్ర దృష్టి’ వల్ల, ఉత్పత్తి సగానికి తగ్గిపోయి, రాష్ట్రంలోని పరిశ్రమలు రోజుకు రూ.257 కోట్ల మేర నష్టపోతున్నాయి. రాష్ట్రంలోని 1.6 లక్షల యూనిట్ల చిన్న తరహా పరిశ్రమలు చితికిపోయి, వాటిపై ఆధారపడ్డ 30 లక్షల మందికి ఉపాధి కరువవుతుంది. కరెంటు కోతల వల్ల, ప్రతి రంగంలోనూ 20-25 శాతం మేర ఉన్న కాంట్రాక్టు కార్మికులపై తొలి వేటు పడనుంది.

హద్దూ, అదుపూ లేని విద్యుత్ కోతలు
పుండు మీద కారం చల్లినట్లు, మన రాష్ట్ర విద్యుత్ సంస్థ విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా తదితర అంశాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ సంస్థ 218.57 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేయవచ్చని, మరో 21.62 మెగావాట్ల విద్యుత్తును బయటి నుంచి కొనుగోలు చేయవచ్చని, కేవలం 6.59 మెగావాట్ల మేర మాత్రమే కొరత ఉంటుం దని అంచనా వేసింది. తద్వారా జూలై నెలలో అసలు కోతలే ఉండవనే తప్పుడు అంచనాలతో తక్కువ విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 264 మెగావాట్లకి చేరుకున్న తరుణంలో కేవలం 215 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతున్నది. విద్యుదుత్పత్తి 203 మెగావాట్లను దాటడంలేదు. అయినా కొనుగోలు మాత్రం 12 మెగా వాట్లే చేస్తున్నారు. రాష్ట్రంలో జూలై 6వ తేదీకి, విద్యుత్ డిమాండ్, ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం 52.50 మెగా వాట్లకి చేరుకుంది. ఫలితంగా పరిశ్రమలకి మూడురోజుల పాటు పవర్ హాలిడే విధించారు. మిగిలిన మూడురోజుల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు 10 శాతం విద్యుత్తును మాత్రమే సరఫరా చేస్తున్నారు.

రాత్రివేళ త్రీ-ఫేజ్ విద్యుత్తును సరఫరా చేస్తున్నా, 75 శాతం కరెంట్ మాత్రమే విడుదలవుతోంది. వ్యవసాయ విద్యుత్ పరిస్థితి మరీ దారుణం. కేవలం రెండు గంటలు, అదీ నాలుగు విడతల్లో సరఫరా జరుగుతోంది. విద్యుత్ సంక్షోభం వల్ల చితికి పోతున్న అన్నదాత వెతలు వర్ణనాతీతం. ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్తులో 33 శాతానికి పైగా, అంటే 83 మెగావాట్లను వ్యవసాయానికే వినియో గించాల్సి వస్తున్నది. కోతల ఫలితంగా, పారిశ్రామిక ఉత్పత్తి నాలు గోవంతుకి పడిపోయింది. రోజూ రెండు లక్షల మంది దినసరి వేతన ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.

ఇంధన చార్జీలు, సర్‌చార్జి పెనుభారం
ప్రభుత్వ అసమంజస నిర్ణయాలతో యావత్ రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో, మరో మారు ప్రభుత్వం చార్జీలు, ఇంధన సర్‌చార్జి సర్దుబాటు (ఎఫ్‌ఎస్‌ఏ)ల పేరిట జనంనెత్తిన మరో పెనుభారాన్ని మోపడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి రూ.4,500 కోట్ల చార్జీల భారాన్ని మోపిన ప్రభుత్వం, జూలై నుంచి సర్దుబాటు పేరిట రూ.1,481 కోట్ల భారాన్ని మోపింది. మరో రూ.8,023 కోట్ల భారాన్ని మోపేందుకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి వైఎస్ హయాంలో ఐదేళ్ల పాటు ఒక్కపైసా కూడా చార్జీలను పెంచలేదు. మరొక పదేళ్లు పెంచమని కూడా హామీ ఇచ్చారు.

కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, సర్‌చార్జి రూపేణా వినియోగదా రుల నుంచి సుమారు రూ.8,023 కోట్లు (2010-11కి రూ.3,062.11 కోట్లు, 2011-12కి రూ.4,960.88 కోట్లు) వసూలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అసలు, ఈ ఇంధన సర్‌చార్జి బూచి అన్నది స్వయంకృతాపరాధమే. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విద్యుత్ సంస్థ ‘ఏపీ జెన్‌కో’కి 5 వేల కోట్ల రూపాయల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లిస్తే, కోతల్లేని కరెంటు సరఫరా, అదనపు భారాన్ని నివారించడం సులభతరం. కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి అవుతున్నా, రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలకి అది అందడంలేదు. సౌర విద్యుదుత్పత్తికి రాష్ట్రంలో మంచి అవకాశాలున్నా ఉత్పాదకత లేదు. పవన విద్యుత్తుపై సరైన ప్రణాళిక లేదు. పథకాలన్నీ, కాగితాలకే పరిమితమవుతున్నాయి.

సంక్షోభ నివారణ సాధ్యమే!
రాష్ట్రంలో 2010-11తో పోలిస్తే, 2011-12లో విద్యుత్ డిమాండ్ 10.89 శాతం ఎక్కువ. అంటే సగటున 10 శాతం డిమాండ్ పెరిగింది. దీని దృష్ట్యా, ప్రభుత్వం సత్వరమే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. రాష్ట్ర విద్యుత్ స్థాపన సామర్థ్యం ప్రస్తుతం 16,021 మెగావాట్లు. గరిష్టంగా డిమాండ్ 12,000 మెగావాట్లు. 3,830 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నా ఏడాదిలో 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. 2,770 మెగావాట్ల సామ ర్థ్యంతో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు ఉన్నా, కొత్తగా మరో 1000 మెగావాట్లు తోడయినా, గ్యాస్ కొరత వల్ల కేవలం 1100 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. పవన, సౌర, బయోమాస్, ఇతర చిన్నాచితకా ప్రాజెక్టుల సామ ర్థ్యం 1100 మెగావాట్లు ఉంటుంది. 2014 నాటికి రాష్ట్రాన్ని ‘ఎనర్జీ హబ్’గా మారు స్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, ప్రస్తుతం నెలకొని ఉన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రం 2014 నాటికి ‘చీకటి రాష్ట్రంగా’ మారకుంటే అదే పదివేలు. విద్యుత్ సంక్షోభ నివారణలో కీలక భూమిక పోషిస్తాయ నుకున్న ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు, అనుమతులు, రాయి తీలు పొంది ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదిరాయి కూడా వేయ కుండా రాష్ట్రానికి మొండిచేయి చూపించాయి.

కింకర్తవ్యం...
నానాటికీ పరిస్థితి తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై వెంటనే దృష్టి సారించాలి. కేంద్రం నుంచి అదనపు విద్యుత్తు పొందాలి. గ్యాస్ ఆధా రిత కేంద్రాలకు గ్యాస్ సరఫరా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. భారీ పరిశ్రమలు సొంతంగా విద్యుదుత్పాదనకు ప్రోత్సాహకాలు కల్పించాలి. గుజరాత్, తమిళనాడు తరహాలో శాశ్వత, స్థిర విద్యుత్తును అందించేందుకు, ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించి అమలు పరచాలి. గుజరాత్‌లో నిరంతర విద్యుత్ పంపిణీ వల్ల పరిశ్రమలు నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. కోటి మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తమిళనాడులో గత వేసవిలో విద్యుత్ కోతలు అమల్లో ఉన్నా, పరిశ్రమలకి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు చర్యలు పారిశ్రామిక రంగానికి ఊతమిస్తు న్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పరిశ్రమలకి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఫీడర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

విద్యుత్ సంక్షోభం వల్ల రాష్ట్ర పారిశ్రామికరంగం తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. ఇన్ని విపత్తులకీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యధోరణే అన్నది నిర్వివాదాంశం. సంక్షో భాన్ని నివారించాలనే చిత్తశుద్ధి, పట్టుదల ప్రభుత్వానికి ఉంటే, రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడే యడానికి తాము సిద్ధంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. నాఫ్తా, డీజిల్‌తో విద్యుదుత్పాదన చేసే అవకాశం ఉన్నప్పటికీ, ట్రాన్స్‌కో అనుమతివ్వడం లేదు. రోజుకు 10.2 ఎంసీఎంల గ్యాస్‌ని ఇవ్వాల్సి ఉన్నా, కేవలం 5 ఎంసీఎంల గ్యాస్ కూడా ఇవ్వడం లేదు. దీంతో 1,670 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం నిరర్థకమవుతోంది.

విద్యుత్ కొనుగోలుకి ఓపెన్ యాక్సెస్ విధానం అమలు చేయాలి. డీజిల్‌పై వ్యాట్‌ని కుదించాలి. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 25 పైసలను మినహాయించాలి. థర్మల్, పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో గల లోపాలను అధిగమించే ప్రయ త్నాలు చేయాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్లు, ఏ సమస్యకైనా తగిన పరిష్కారం ఉంటుంది. కావాల్సిం దల్లా, తపన, తగిన కార్యదీక్ష, చిత్తశుద్ధి. ఇప్పటికైనా ప్రభు త్వం రాజకీయ ప్రయోజనాలు, అంతర్గత కుమ్ములాటలకి స్వస్తి చెప్పి, నీరో చక్రవర్తి పాత్ర పోషించడం మాని, సమస్య పరిష్కారం దిశగా ఆశావహక చర్యలు చేపట్టాలి. సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!