తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు సుప్రీం తీర్పును వక్రీకరిస్తున్నారన్నారు. ఆ పార్టీ నేతలు దయచేసి జాతీయ పత్రికలు చదివితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. చంద్రబాబు అవినీతిని కచ్చితంగా నిరూపిస్తామని చెప్పారు. చంద్రబాబు దొరకని దొంగ మాత్రమేనని, నీతిమంతుడు కాదని విమర్శించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలవి తాత్కాలిక సంబరాలేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన రెడ్డికి ఒక న్యాయం, చంద్రబాబుకు ఒక న్యాయమా? అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆమె అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment