సిరిసిల్లలో ఉనికి గల్లంతవుతుందన్న ఆందోళనతోనే ఎమ్మెల్యే తారకరామారావు వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈనెల 23న చేసిన దీక్షపై రాద్ధాంతం చేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. వైఎస్సార్ పార్టీ గతంలో ఫీజుపోరుతో హైదరాబాద్‌లో, ఆర్మూరులో రైతు దీక్ష చేసినప్పుడు ఎలాంటి అభ్యం తరం చెప్పని టీఆర్‌ఎస్.. ఇప్పుడు తన కుమారుడి సీటుకు ఎసరు వచ్చిందన్న దుగ్ధతోనే ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు ఈ విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు.
గురువారం గోనె సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గతం లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు నిరవధిక దీక్ష అంటూ జంతర్‌మంతర్‌లో ఒకరోజు దీక్ష చేయడం, 2009లో హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో చేసిన దీక్ష గురించి త్వరలో బహిరంగలేఖ రాస్తానన్నారు.

No comments:
Post a Comment