హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదని, లక్ష్మీపేట బాధితులను ఆదుకోవడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు విమర్శించారు. తమపై దాడులకు ప్రోత్సహించింది బొత్స సత్యనారాయణ, దాడులకు పాల్పడింది బొత్స వాసుదేవనాయుడేనని ఈ నెల 17న హైదరాబాద్ నడిబొడ్డున లక్ష్మీపేట బాధితులే స్వయంగా చెప్పినా ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని.. ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. సోమవారమిక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బొత్స సత్యనారాయణ మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తూ.. దళితులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిందితులను కాపాడుతూ వస్తోందని.. నిందితుల్లో 19 మందిని ఇంకా అరెస్టు చేయలేదన్నారు. మృతి చెందినవారి కుటుంబాలనే ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించిందని.. గాయపడ్డ 88 కుటుంబాల సంగతేమిటని ప్రశ్నించారు. లక్ష్మీపేట బాధితులకు రాష్ట్ర సర్కారు న్యాయం చేయనందున.. తమ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆగస్టు 22న ఢిల్లీలోని పార్లమెంట్ ముందు బాధిత కుటుంబాలతో ‘జాతీయ దళిత హక్కుల ర్యాలీ’ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Monday, 23 July 2012
బాధితులే చెప్పినా ‘బొత్స’పై చర్యల్లేవు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment