‘‘సిరిసిల్ల ఏమైనా పాకిస్థానా? అదేమైనా పాకిస్థాన్లో ఉందా? అక్కడికి ఎవరినీ రావద్దని అనడం ఏమిటి? ఇదేం ప్రజాస్వామ్యం? టీఆర్‌ఎస్ నేతలు నిరంకుశంగా, నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారు. కొడతాం... కాల్చుతాం... ఇక్కడికి ఎవరూ రావద్దు అని బెదిరించడమేమిటి?’’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి మండిపడ్డారు. ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్‌లో సమావేశాలు పెట్టవ ద్దు, మాట్లాడవద్దు, తెలంగాణలో తిరగవద్దంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ విజయమ్మ చేనేత దీక్షను టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా తిరగవచ్చని, వారి వాదనలు వినిపించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. తెలంగాణపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment