సిరిసిల్ల(కరీంనగర్), న్యూస్‌లైన్: సిరిసిల్లలో నేత కార్మికుల సమస్యలపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం ధర్నా చేశారు. ఆ ధర్నాకు వైఎస్సార్సీపీ కండువాలు వేసుకుని టీఆర్‌ఎస్ నేతలు ఎవరికీ అనుమానం రాకుండా జనం మధ్యలో చేరిపోయారు. పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. విజయమ్మ వేదికపైకి రాగానే టీఆర్‌ఎస్ నేతలు లేచి గొడవకు కారణమయ్యారు. కరీంనగర్‌కు చెందినటీఆర్‌ఎస్ నాయకురాలు తాటి ప్రభావతి సోమవారం నేతన్న ధర్నాలో చేరింది. ఆమెను వైఎస్సార్సీపీ నాయకులు గుర్తించి బయటకు పంపించారు.
సాయంత్రం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాంతీయ వైద్యశాలలో గాయపడ్డ వారిని పరామర్శించి మీడియాతో మాట్లాడగా ఎమ్మెల్యే పక్కన సదరు మహిళా నాయకురాలు తాటిప్రభావతి కనిపించారు. కావాలనే కండువాలు మార్చి నేతన్న ధర్నాలో చేరి, గొడవలకు టీఆర్‌ఎస్ నేతలే కారణమయ్యారన్నది స్పష్టం. రాజకీయాలెన్నున్నా ధర్నాలో గందరగోళానికి కారణమెవరో ఈఫొటోలు చూస్తే అర్థమవుతుంది. గొడవల వెనుక మూలాలేమిటో బోధపడుతుంది. తెలంగాణవాదులే అడ్డుకున్నారని టీఆర్‌ఎస్‌నేతలు చెబుతుండగా, టీఆర్‌ఎస్ వాళ్లే ఇలాంటి గిమ్మిక్కులతో గొడవకు కారణమైనట్లు స్పష్టమవుతోంది.
No comments:
Post a Comment