హైదరాబాద్: పోలవరం టెండర్లు తక్షణం రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. పారదర్శకంగా పోలవరం టెండర్లు మళ్లీ పిలవాలని కోరారు. లేదా అఖిలపక్షం ముందు ఫైళ్లు పెట్టి టెండర్లను ఆమోదించాలన్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. కొందరు కాంట్రాక్టర్లను రింగ్ చేయడంలో సీఎం పేషీ ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపించారు. పోలవరం టెండర్లలో ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వమే కాంట్రాక్టర్లను రింగ్ చేసిందని చెప్పారు. సోమాలో భాగస్వామిగా ఉన్న సీజీజీసీ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. రెండు కంపెనీల బిడ్లు మాత్రమే ఎందుకు తెరిచారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం మౌనంగా ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment