YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 28 July 2012

వైఎస్ఆర్ సీపీ లేదా జగన్ పెరెత్తినా టీఆర్ఎస్,టీడీపీ- కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు

చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పునాదులు గల్లంతు కావడం ఖాయమేనా? అనే అంశంపై ఇపుడు రాష్ట్రంలో సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు జరిగినా ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల నాటి ఫలితాలే పునరావృత్తం కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. 

దివంగత మహానేత వైఎస్ఆర్‌కు వారసుడుగానే కాకుండా నిజమైన రాజకీయ వారసుడిగా జగన్‌నే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకే.. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు కృషి చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం పాలకులను నమ్మడం లేదు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 

మరోవైపు... తెలంగాణ అంశంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించడంతో పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను విస్మరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు కొమ్ముకాస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. దీంతో చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం పూర్తిగా సన్నగిల్లి పోయింది. దీనికి నిదర్శనమే.. గత ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. పైపెచ్చు.. వచ్చే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని సాక్షాత్ టీడీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అభద్రతాభావం నెలకొంది. ఫలితంగా జగన్‌ వైపు పరుగు లంఘించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఇకపోతే.. తెలంగాణ రాష్ట్ర సమితి. వైఎస్ఆర్ సీపీ లేదా జగన్ పెరెత్తినా టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన పరకాల ఉప ఎన్నికే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ గెలిచి ఓడారు. టీఆర్ఎస్ నేతల్లో ముచ్చెమటలు పోయించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకున్న ప్రయాణం సాగిస్తున్న టీఆర్ఎస్.. పరకాల ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌కు పట్టం కట్టినంత పని చేశారు. ఇది తెరాస నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 

మున్ముందు వైఎస్ఆర్ సీపీ బలం తెలంగాణలో బలం పుంజుకుంటే తమ పీఠాలు కూలిపోతాయన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే జగన్ లేదా విజమయ్య పర్యటనలంటే వారికి కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పర్యటనలు అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. గతంలో మానుకోట నిన్న సిరిసిల్ల ఘటనలతో ఇది రుజువైంది. 

ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే జగన్ బయటకొచ్చి మరోమారు రాష్ట్రంలో వైఎస్ఆర్ తరహాలో పాదయాత్ర లేదా మరో పేరుతోనే శ్రీకారం చుడితే ఈ రెండు పర్యటనలు చేపట్టిన పక్షంలో ఈ మూడు పార్టీల పునాదులు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!