హైదరాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ప్రథమ శత్రువు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎంఏ రహమాన్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తాలో బుధవారం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రహమాన్ మాట్లాడుతూ, తెలంగాణ సెంటిమెంట్‌ను ఎలక్షన్-కలెక్షన్‌గా మార్చారని ధ్వజమెత్తారు. తమపార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లకు వెళితే కిరాయిమూకలతో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. దాడులు, వాహనాలు ధ్వంసం చేసి తెలంగాణ సంస్కృతిని మంటగలిపారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేసే వారందరిని మోసం చేయటం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. ఆలె నరేంద్ర మొదలుకుని రహమాన్ వరకు నమ్మక ద్రోహానికి బలైనవారేనని వివరించారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడు, కూతురు స్వార్ధం కోసం తెలంగాణవాదాన్ని బలిపెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అందులో అమాయక బీసీ,ఎస్సీ, మైనారిటీ సోదరులు బలికావద్దని రహమాన్ విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల ఘటనపై కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనట్లయితే వారిని హైదరాబాద్‌లో తిరగనివ్వమని రహమాన్ హెచ్చరించారు.
No comments:
Post a Comment