రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టాలని, కొరత లేకుండా ఎరువుల పంపిణి చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు విశ్వేశ్వర్‌రెడ్డి, కవిత, అనంత జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment