టీడీపీ అధినేత చంద్రబాబు గత జనవరిలో వరంగల్‌లో పర్యటించినప్పుడు.. ‘చంద్రదండు’ పేరిట తెలంగాణవాదుల మీద జరిపిన దాడులకు సంబంధించి నివేదికను సమర్పించడంలో రాష్ట్రప్రభుత్వం జాప్యం చేయడం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వెలిబుచ్చింది. అనేక గడువులిచ్చినా ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడంపట్ల అసహనం వ్యక్తంచేసింది. చంద్రబాబు వరంగల్ పర్యటన సందర్భంగా.. తెలంగాణవాదులపై దాడులతో సంబంధమున్నవారిమీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తెలంగాణ ప్రాంత న్యాయవాది అరుణ్‌కుమార్ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో జనవరిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాజా స్థితిని తెలుసుకునేందుకు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వెళ్లిన అరుణ్‌కుమార్‌కు అక్కడి అధికారులు రాష్ట్రప్రభుత్వానికి చివరిసారిగా పంపిన లేఖను అందజేశారు. అందులో ప్రభుత్వాన్ని ఎన్నిమార్లు నివేదికలు కోరిందీ... ప్రభుత్వం నుంచి స్పందన ఎలా కరువైందీ స్పష్టంగా ఉంది. వరంగల్ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని జనవరి 18న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించినా జూన్ వరకు జవాబు రాలేదు. హెచ్చరిక పంపినా పట్టించుకోలేదు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment