మంగళం(చిత్తూరు జిల్లా): ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి వార్డుబాట, పల్లెబాట, ప్రజాబాట కార్యక్రమాలను చేపట్టిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తాజాగా గ్రామీణ ప్రజల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు పల్లె నిద్రకు శ్రీకారం చుట్టారు. శనివారం తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాళెం పంచాయతీ దళితవాడలో ఆయన పల్లె నిద్ర చేసి ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు. పల్లె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
శనివారం సాయంత్రం 6 గంటలకు దళితవాడ ఆలయం వద్దకు చేరుకుని కఠిక నేలపై కూర్చుని కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్నారు. రాత్రి 10.30 గంటల వరకు గ్రామస్తులతో చర్చించి తర్వాత స్థానికులతో కలసి కఠిక నేలపై నిద్రించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, మాజీ ఎంపీపీ తిరుమలయ్య, మండల మాజీ ఉపాధ్యక్షుడు ఆదం రాధాకృష్ణారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు కైలాసం, మాజీ వార్డు సభ్యుడు రామిరెడ్డి, నాయకులు రాజేంద్ర పాల్గొన్నారు.

No comments:
Post a Comment