సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు దీక్ష ప్రారంభించారు. దీక్షా శిబిరం నేతన్నలు, మహిళలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు విజయమ్మ ఈరోజు ఇక్కడకు వచ్చారు. నేతన్నకు అండగా నిలిచి ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన విజయమ్మకు సిరిసిల్లవాసులు, చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికాయి. విజయమ్మతోపాటు మాజీ మంత్రి కొండా సురేఖ కూడా దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరం వద్దకు భారీగా జనం తరలివచ్చారు.
ఇదిలా ఉండగా, దీక్షను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రాంగణం వద్ద వారు కొద్దిసేపు రభస చేశారు.
ఇదిలా ఉండగా, దీక్షను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రాంగణం వద్ద వారు కొద్దిసేపు రభస చేశారు.
No comments:
Post a Comment