వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ల విభాగం కన్వీనర్‌గా డా.గోసుల శివభరత్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆర్థోపెడిక్ నిపుణులైన శివభరత్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా శివభరత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన డాక్టర్ల విభాగానికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్సార్ చూపిన బాటలో ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో వైఎస్ అభిమాన డాక్టర్లందరినీ సంఘటితం చేసి మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ విభాగం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఆగస్టు 5వతేదీన పోలవరంలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment