ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీవైఎస్సార్‌టీఎఫ్) సోమవారం హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. షేక్‌పేట హైస్కూల్లో ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ క మిటీ కన్వీనర్ కె.ఓబుళపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష సభ్యత్వాల నమోదును లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, పరిష్కారం కోసం టీచర్లు ఐక్య పోరాటాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే 10వ వేతన సవరణ కమిటీని నియమించాలని, హెల్త్ కార్డులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు అశోక్‌కుమార్‌రెడ్డి, రమేష్, సుబ్బారెడ్డి, రమేష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment