చిల్లర రాజకీయాలు మానుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి సలహా ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు విజయమ్మ చేపట్టిన దీక్షా శిబిరంలో ఆయన ప్రసంగించారు. తాను పుట్టింది ఇక్కడేనని, కేసిఆరే తెలంగాణ వలసవాది అని విమర్శించారు. తాము
తెలంగాణవాదులమేనని గట్టిగా చెప్పారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సమస్యలకు, తెలంగాణ వాదానికి ముడిపెట్టడం భావ్యంకాదన్నారు. తెలంగాణవాదం బలహీనపడలేదని, కేసీఆర్ లాంటివారే బలహీనపరుస్తున్నారని విమర్శించారు. ఆడపడుచు వస్తే గౌరవంగా ఆహ్వానించడం తెలంగాణ సాంప్రదాయం అన్నారు. ఆమెని
అడ్డుకోవడం తప్పని చెప్పారు.నేతన్నల ఆకలి చావులు ఆపేందుకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం ఆ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు.
ఆ పార్టీ మరో నేత బాజిరెడ్డి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ విజయమ్మ దీక్షని అడ్డుకోవడం రాజకీయ దురుద్ధేశమేనని ఆయన అన్నారు. తాము తెలంగాణవాదులమేనని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసినవారిపై తాము పోటీకి నిలవని విషయాన్ని గుర్తు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment