27-7-12-47421.jpg)
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
పేదవాడు తన భూములు అమ్ముకోవాలన్నా, లేదా కాస్త ధైర్యం చేసి కొనాలన్నా జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని గట్టు ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్తి విలువలో 0.5 శాతం పెంచితే దాన్ని భరించడం ఎలా? అని ప్రశ్నించారు. ఆఖరికి పెళ్లి రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా 40 రెట్లు పెంచడాన్ని తప్పుబట్టారు. భూములు, భవనాల విలువను పెంచాలని ప్రభుత్వం భావిస్తే అందుకు వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా విద్యుత్ సర్‌చార్జీల విషయంలో రూ.1,500కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరించాలని గట్టు డిమాండ్ చేశారు. మంత్రి పార్థసారథికి నైతికత ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
No comments:
Post a Comment