వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఈ నెల 28న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది. కార్మికులెదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఈ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ గురువారం తెలిపారు. పరిశ్రమల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, అసంఘటిత కార్మిక సమస్యలపైనా చర్చిస్తామన్నారు.
అదేవిధంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంఘాల నిర్మాణం, సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ పదాధికారులు, జిల్లాల అధ్యక్షులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పార్టీ ట్రేడ్ యూనియన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారని జనక్ ప్రసాద్ తెలిపారు.

No comments:
Post a Comment