సిరిసిల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను రాజకీయ కోణంలో చూడొద్దని ఆపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి కోరారు. సోమవారం ఉదయం ఆమె ఇక్కడ విలేకర్లలో మాట్లాడుతూ నేతన్నకు అండగానిలబడి భరోసా ఇచ్చేందుకే సిరిసిల్లలో విజయమ్మ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షతో నేత కార్మికుల కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతామన్నారు. టీఆర్ఎస్, ఉద్యమ సంఘాలు అర్థం చేసుకుని సహకరించాలని శోభానాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment