ఒంగోలు : ఇప్పటికే చతికిలపడిన తెలుగుదేశం పార్టీకి పంక్చర్ మీద పంక్చర్ పడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి సోమవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పంపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్టీఆర్ అభిమానులను అణిచివేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
యువకులకు టిక్కెట్లు ఇస్తానని ఆయన మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీలకు వంద శాతం సీట్లు ఇస్తామనటం కూడా మోసంలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం కోల్పోయిన ఎన్టీఆర్ అభిమానులంతా త్వరలో పార్టీ నుంచి బయటకు వస్తారన్నారు. తన నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చుండూరి రవి ప్రకటించారు.

No comments:
Post a Comment