వైఎస్ విజయమ్మ దీక్షకు సర్వం సిద్ధమైంది. దీక్షను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. దీక్షకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీలు చేసిన అనంతరమే అనుమతి ఇస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు దీక్షను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బలగాలు మోహరిం చారు.
జగిత్యాల ఏఎస్పీ రమారాజేశ్వరి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా, ఇద్దరు ఏఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 75 మంది ఎస్సైలు, 113 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 465 మంది కానిస్టేబుళ్లు, 12 మంది మహి ళా కానిస్టేబుళ్లు, 91 మంది మహిళా హోంగార్డులు, 465 మంది హోంగార్డులతో పాటు ఏడు కంపెనీల అదనపు పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. సిరిసిల్లకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో వాహనాలను పోలీసులు క్షుణ్టంగా తనిఖీ చేస్తున్నారు. పట్టణం మొత్తం పోలీస్ బలగాలతో నిండిపోయింది. సిరిసిల్లకు వచ్చే దారి పొడవునా ప్రత్యేక బలగాలు మోహరించారు.

No comments:
Post a Comment