కాన్పూర్ : స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆమె స్పృహలోకి రాలేకపోయారని, మందులకు స్పందించలేక తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. 1940లో డాక్టర్‌గా లక్ష్మి స్వామినాథన్ సింగపూర్‌లో సైనికులకు వైద్యసాయం అందించేవారు.
అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్ లోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్‌లో చేరి సేవలందించారు. భారత్‌కు తిరిగివచ్చాక 1971లో సిపిఎంలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998లో పద్మభూషణ్ అవార్డును పొందారు. 2002లో వామపక్షాల తరఫున రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అబ్దుల్ కలాంతో పోటీపడి ఓడిపోయారు. 1947లో లాహోర్‌కు చెందిన కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ తో వివాహం అయ్యాక ఆమె కాన్పూర్‌లో స్థిరపడ్డారు.

No comments:
Post a Comment