సిరిసిల్ల నేతన్న ధర్నాకు హాజరవుతున్న వైఎస్ విజయమ్మకు అడుగడుగునా ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. షామీర్ పేట నుంచి బయల్దేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలికి మెదక్ జిల్లా సరిహద్దు.. వంటిమామిడి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ పూల మాలలు వేశారు. పెద్ద ఎత్తున హాజరైన అభిమానులకు ఆమె అభివాదం పలికారు.
ఉదయం నుంచి వైఎస్ విజయమ్మ రాక కోసం సమీప గ్రామస్తులు వంటిమామిడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమెకు అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
Sunday, 22 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment