కాకినాడ(తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: ‘మీ అంతు చూస్తా... మీ ఆఫీసులు తగలబెట్టించేస్తా... పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ ఈ మాటలు అన్నది ఎవరో మామూలు వ్యక్తి కాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు. ఇటీవల జరిగిన రామచంద్రపురం ఉపఎన్నికలో శాసనసభ్యునిగా ఎన్నికైన తోట త్రిమూర్తులు. ఆయనపై ఉన్న భూ తగాదా కేసును ఉప సంహరించుకుంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఆదివారం ‘సాక్షి’ లో ‘తోటపై కేసు ఎత్తివేత’ శీర్షికన వచ్చిన వార్తపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కాకినాడలోని ‘న్యూస్‌లైన్’ ప్రతినిధికి ఫోన్‌చేసి తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. తనపై వార్త రాసిన విలేకరి అంతుచూస్తానని బెది రిం చారు. ‘మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? రాసిన విలేకరి పేరు చెప్పండి. అతని సంగతి చూస్తాను’ అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం కేసు ఉపసంహరించుకున్న సమాచారం వాస్తవమని ఒప్పుకుంటూనే తనపై గతంలో దాఖలైన కేసులను కూడా ప్రస్తావిస్తూ రాయడంపై త్రిమూర్తులు మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment