రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని వైఎస్ జగన్ సోదరి షర్మిల విమర్శించారు. సీఎం కిరణ్‌కు ఢిల్లీ పర్యటనలకే సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. కిరణ్, చంద్రబాబు ఎంత అధ్వాన్నాంగా ఉన్నారో అధికారులూ అలాగే మారారని అన్నారు. ఉరవకొండలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను గాలిమరల సర్కిల్ వద్ద కొందరు గొర్రెల కాపర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గొర్రెలకు జబ్బు చేస్తే మందులిచ్చే నాధుడు లేడని వాపోయారు. వైఎస్‌ఆర్ హయాంలో కార్పొరేషన్ ద్వారా లబ్ధిచేకూరేదని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు పంటరాకపోయినా బీమా వస్తుందన్న ధీమా ఉండేదన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, జననేత వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర విజయవంతం కావాలంటూ పలువురు ప్రవాసాంధ్రులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇక్కడి నుంచి షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు అనంతపురంకు పయనమయ్యారు. |
source:sakshi
No comments:
Post a Comment