రాష్ర్టంలో నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సోమవారం సిరిసిల్లలో ధర్నా చేయాలన్న తన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకులు, ఉద్యమ సంఘాలకు చెందిన నేతలు అర్థం చేసుకోవాలని, ఈ ధర్నా ప్రజల సమస్య అయినందున, దీనిని తెలంగాణతో గాని, మరో రాజకీయ అంశంతోనో ముడిపెట్టి చూడవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
నేతకారులు మన రాష్ట్ర ప్రజానీకంలో అణగారిన సామాజిక వర్గమైనందున వారి సమస్యల పరిష్కారంలో మిగతా పార్టీలు కూడా కలిసి రావాలని, తాను తలపెట్ని ధర్నాకు ప్రజా ప్రయోజనాల రీత్యా ఎలాంటి ఆటంకమూ కల్పించవద్దని కోరారు. ప్రజా సమస్యల మీద పోరాటంలో కలసికట్టుగా పని చేయాలన్నది తమ అభిప్రాయమని, నేతన్నకు మద్దతుగా తమ పోరాటానికి మిగతా రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని, పర్యటనకు, ధర్నాకు ఆటంకాలు కల్పించ వద్దని విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment