హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను.. ఆయన తనయుడు జగన్ మాత్రమే సమర్థంగా అమలు చేయగలరని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. ఆదివారమిక్కడ కుషాయిగూడ, కాప్రా జమ్మిగడ్డలో జరిగిన బోనాల జాతరల్లో ఆమె పాల్గొన్నారు. కుషాయిగూడలో వందలాది మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆమె అమ్మవారికి బోనం సమర్పిం చారు. అనంతరం శోభానాగిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ‘చేనేత దీక్ష’ విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు
Sunday, 22 July 2012
జగన్ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment