వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం ఉదయం సిరిసిల్లా నేతన్న దీక్షకు బయల్దేరారు. లోటస్ పాండ్ నుంచి ఆమె ప్రత్యేక వాహనంలో పయనం అయ్యారు. విజయమ్మతోపాటు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సుచరిత, ధర్మాన కృష్ణదాస్ ఇతర నేతలు కూడా ఉన్నారు. మార్గమధ్యంలో మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ ఆమెను కలుసుకోనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు వైఎస్ విజయమ్మ నేత దీక్ష ప్రాంగణానికి చేరుకోనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment