మరోకోణంలో చూడొద్దు: జనక్‌ప్రసాద్
కేటీఆర్‌పై హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తా: నల్లా సూర్యప్రకాష్‌రావు
తెలంగాణపై విజయమ్మ వైఖరి చెప్పాలి: మంత్రి బస్వరాజు సారయ్య
వైఎస్ హయాంలోనే ఆత్మహత్యలు: వినోద్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: తూర్పు
టీఆర్‌ఎస్, జేఏసీ నిరసనలు, నేతల ముందస్తు అరెస్టులు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో తలపెట్టిన నేతన్న ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ధర్నాకు మద్దతుగా, వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నేతన్న ధర్నాను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతుండగా.. అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్, జేఏసీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ధర్నాను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు పెద్దఎత్తున బైక్‌ర్యాలీ చేపట్టారు. ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి, ఆదిశ్రీనివాస్, రాజ్‌ఠాకూర్, పుట్ట మధులు కార్మిక క్షేత్రాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ నేతలు తెలంగాణవాదం ముసుగులో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్న కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే విజయమ్మ ధర్నా చేపడుతున్నారని వైఎస్సార్సీపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ అంశాన్ని మరో కోణంలో చూడరాదన్నారు. ఎమ్మెల్యే తారకరామారావుపై మానవహక్కుల సంఘం, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయిస్తానని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో చెప్పారు.

No comments:
Post a Comment