ప్రజా సంక్షేమమే ధ్యేయంగా లెక్కలేనన్ని పథకాలు అమలుపరచి అందరి మనసుల్లో స్థిరమైన స్థానం సంపాదించిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలు తొలగించేందుకు పాలక,ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన రెక్కల కష్టంతో రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే ఆ పార్టీనేతలే కుట్రలు పన్నడం విశ్వాసఘాతుకమన్నారు. మండలంలోని సిరసపల్లి గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం వైఎస్ విగ్రహాలను జిల్లాకు ఒకటి మాత్రమే ఏర్పాటు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఊరూ వాడా వెలసిన ఆమె తండ్రి, మాజీ సీఎం ఎన్టీరామారావు విగ్రహాల మాటేమిటని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత అభివృద్ధిని చేసి చూసినందునే అట్టడుగు వర్గాలవారు సైతం తమ దినసరి కూలీ నుంచి కూడబెట్టుకున్న డబ్బుతో ఈరోజు మహానేత విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఆయన విగ్రహాలను తొలగించాలని చూస్తే ప్రజల వ్యతిరేకత ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు.
Sunday, 22 July 2012
మహానేత విగ్రహాల తొలగింపునకు రాజకీయ కుట్ర

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment