గుడ్లవల్లేరు(కృష్ణా),న్యూస్‌లైన్: ఇకపై తాను వైఎస్సా ర్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలోనే నడుస్తానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)చెప్పారు. ఆదివారం అంగలూరులో కొడాలి నాని యూత్ ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాబో యే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రానికి జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు. ఈసారి 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కాదు కదా.. కనీసం ప్రతిపక్షంలో కూర్చునే శక్తి కూడా లేదని తేల్చిచెప్పారు. మూడోసారి కూడా తనకు ఓటు వేస్తే.. రాబోయే టీడీపీప్రభుత్వం కలర్ టీవీ, నెలనెలా జీవన భృతి ఇస్తుందని మోసం చేయడం తనకు అన్యాయంగా తోచిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని, విజయమ్మను పరామర్శించడానికి వెళ్తే ఏకపక్షంగా చంద్రబాబు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, తనకు మేలు చేశారని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడిచి, ఆయన్ని సీఎంగా చేసేందుకు, గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడుతానని స్పష్టం చేశారు.
Sunday, 22 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment